బూర్గంపాడు ఏజెన్సీలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత వైద్యులు, సిబ్బందిని నియమించాలి: సీపీఎం

పయనించే సూర్యుడు, జులై 07, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ బూర్గంపాడు మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సిపిఎం బృందంతో ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయికి పరిమితమైందని, దీంతో మండల ప్రజలు సరైన వైద్య సేవలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డిప్యుటేషన్‌పై వచ్చిన వైద్యులు, సిబ్బందితోనే ఆసుపత్రిని నిర్వహించడం దురదృష్టకరమని పేర్కొంటూ, వెంటనే శాశ్వత వైద్యులు, అవసరమైన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.2026 జనవరిలో ప్రారంభం కావాల్సిన నూతన ఆసుపత్రి భవనం ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వరదల ముప్పు దృష్ట్యా ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలను ఏర్పాటు చేసి మండల ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, నాయకులు పాండవుల రామనాథం, రాయల వెంకటేశ్వర్లు, వై. అప్పారావు తదితరులు పాల్గొన్నారు