పయనించే సూర్యుడు న్యూస్, మే 29 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచన మేరకు లారీ యూనియన్ కళ్యాణ మండపంలో మహానాడు-2026 రెండో రోజు వర్చువల్ క్లస్టర్ సమావేశాలు టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్లస్టర్-3 ఇన్‌చార్జ్ బొదిరెడ్డి గోపి,పట్టణ పార్టీ అధ్యక్షుడు మూది నారాయణస్వామి నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. వర్చువల్ మహానాడు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ కన్వీనర్లు, కో-కన్వీనర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడు కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు,ఎన్టీఆర్ ఆశయాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, మీసాల రాజు, వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, ఎండగుడి నాగబాబు, కోణాల వెంకటరమణ, గట్టిం పెద్దకాపు, మామిడి లలిత, రాయుడు చిన్నా, వైభోగుల సుబ్బారావు, రాతికింది సతీష్, పతివాడ అఖిలేష్, జుత్తుల శ్రీను, శంఖాని బాబ్జి, నీలి త్రిమూర్తులు, గొడత రాజాబాబు, సేనాపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.