బోధన్ లో ఇందిరమ్మ గృహప్రవేశాలు.

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 బోధన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సోమవారం బోధన్ పట్టణంలో ఆజం గంజ్ 13 వార్డులు నిర్మించిన ఇందిరమ్మ గృహప్రవేశాలకు బోధన్ ఆర్డీవో విజయ కుమారి మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ గృహప్రవేశాలకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఇందిరమ్మ గృహాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు అధికారులు,ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.పూర్తికాని ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు