బోధన్ లో విద్య వ్యవస్థలను కాపాడుకుందాం.

★ మీడియా సమావేశంలో విద్యార్ధి సంఘాల పిలుపు.

పయనించే సూర్యుడు న్యూస్ జులై 5 బోధన్ : బోధన్ లో విద్యావ్యవస్థను కాపాడుకుందామని విద్యార్థి సంఘాల నారకులు పిలుపునిచ్చాయి శనివారం పట్టణంలో బిఆర్ఎస్వి బివిఎఫ్ జివిఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా విద్యార్ధి సంఘాల నేతలు వడ్ల సతీష్ చారి జాదవ్ ప్రవీణ్ నాయక్ సిరివెసు సంతోష్ లు మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులో నాణ్యమైన విద్యను అందిస్తూ రాష్ట్రంలోనే బోధన్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరిగిదన్నారు ఎడ్యుకేషన్ హబ్ గ ఉన్న బోధన్ లోని ప్రైవేట్ విద్యా సంస్థలను కొన్ని విద్యార్ధి సంఘాల నాయకులు వారి స్వలాభం కోసం బ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.విద్యార్ధి సంఘాలు విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలకు వారదిలా ఉండి సమస్య పరిష్కరించే విదంగా ఉండాలి కానీ సమస్యను అవకాశంగా మలుచుకొని వారి పబ్బం గడుపుకోవడానికి అవకాశవాదులుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు ఒక వేల మీరు ఇలా విద్య వ్యవస్థను బదనాం చేసే పనులు చేపడితే చుట్టూ ప్రక్కన గ్రామాల మండలాల జిల్లాల నుండి బోధన్ కి చదింవీచడానికి ఆసక్తి చూపే తల్లి తండ్రులు వారి నిర్ణయాలను మార్చుకుంటూ పోతే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు దెబ్బతిని ఇటు ప్రత్యక్షంగా అటు పరోక్షంగాను ఎంతో మంది ఉపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు కావున విద్యార్థి సంఘాలు అనేటి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉండాలి కానీ విద్యాసంస్థలను నాశనం చేసే విధంగా ఉండకూడదని కోరారు ఈ సమావేశంలో కొర్రా బంతి లాల్ నాయక్ ఆఫనాన్ విద్యార్ధి సంఘ నాయకులు పాల్గొన్నారు.