బోయకొండ గంగమ్మను దర్శించుకున్న రాజంపేట ఎంపీ పెద్ది రెడ్డి వెంకట మిథున్ రెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 07.07.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆయనకు పూర్ణకుంభం పట్టి ఘనంగా స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం వేద మండపంలో వేద ఆశీర్వాదం అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాదాలు మెమొంటోతో సత్కరించారు అనంతరం ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు బోయకొండ గంగాపురం ఆర్ఆర్ కాలనీ లకు చెందిన బాల గంగిరెడ్డి ప్రసాదు జీవీఎస్ రమణ తదితర వైసిపి నాయకుల కోరిక మేరకు వారి ఇండ్లకు వెళ్లారు నూతన వధూవరులను ఆశీర్వదించారు అంతకుముందు బోయకొండ భవాని నగర్ లో నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గజమాలవేసి బాణా సంచాలతో ఘనంగా స్వాగతం పలికారు అంతేకాకుండా చౌడేపల్లి నుంచి బోయకొండ వరకు ప్రతి గ్రామంలోనూ ప్రజల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి రాష్ట్ర వైకాపా ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు మహిళా కార్యదర్శి రుక్మిణమ్మ మండల ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి నరసింహులు యాదవ్ బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకరనారాయణ ధర్మకర్త పవన్ రాయల్ వైకాపా రాష్ట్ర యువజన అధ్యక్షుడు మిద్దింటి కిషోర్ బాబు రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ అనుప్రియ మాజీ ఎంపీపీ కూరపర్తి అంజిబాబు లడ్డు రమణ జంగాలపల్లి రమణ ఓదులుపేట శేషాద్రి శ్రీరామ్ భారత్ వరుణ్ అరుణ్ కుమార్ షంషీర్ గిరి అల్తాఫ్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు