బోరు మోటర్ కేబుల్ వైర్ 80 మీటర్లు చోరీ

★ మరొక రైతు బోరు బావి దగ్గర 70 మీటర్లు డబుల్ కేబుల్ వైరు చోరీ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 13.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// చౌడేపల్లి మండలం పంచాయతీ కేంద్రంచారాలలో రైతు రవికుమార్ బోరు బావి దగ్గర బోరు మోటర్ వైరు 70 మీటర్లు డబుల్ కేబుల్ వైరు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు ఇంకో రైతు నరేష్ బాబు బోరుబావి దగ్గర కూడా 80 మీటర్లు బోర్ కేబుల్ వైరు చోరీ జరిగింది బాధితులు నష్టపోయిన రైతులు మాట్లాడుతూ మాకు ఇద్దరికీ కలిపి దాదాపుి 40 వేలు రూపాయలు విలువచేసే బోర్ మోటార్ కేబుల్ వైర్ నష్టం జరిగిందని రైతులు వాపోయారు బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలియపరచారు అన్నం పెట్టే అన్నదాతపొలాల్లో బోరు బావి దగ్గర ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం కావున నష్టపోయిన రైతులను గుర్తించి వారిని ప్రభుత్వం వారు ఆదుకోవాలని చుట్టుపక్కల రైతులు కోరుకున్నారు