పయనిoచే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 16 గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, జూన్ 24 తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు జరగబోయే,28వ వార్షీక బ్రహ్మోత్సవాలలో భాగంగా,, సోమవారం గౌరవ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ,డాక్టర్ పాశం సునీల్ కుమార్ నివాసంలో వారి చేతుల మీదగా బ్రహ్మోత్సవాలు ఆహ్వన పత్రిక,విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతు దేవస్థానం, చైర్మన్ మరియు ధర్మకర్త మండలి సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపించవలసిందిగా, దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించవలసిందిగా,, చైర్మన్ మరియు ధర్మకర్త మండలి సభ్యులకు తెలియజేశారు,, ఈ సందర్భంగా చైర్మన్, మరియు ధర్మకర్త మండలి సభ్యులు మాట్లాడుతో,, దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలకు గూడూరు శాసన సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు , కార్యనిర్వహణాధికారి రవికృష్ణ,ధర్మకర్త మండలి సభ్యులు, శ్రీ పేపళ్ల అమరయ్య నాయుడు , మంగళపూర్ గోపాల్ ,పర్వతాల నాగేంద్ర, కొమ్మా రవీంద్రబాబు, ఓబిలి బాబు,సాయి కృష్ణ, మునికోటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.