పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 05 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి వారి దత్తపీఠంలో ఇటీవల నిర్వహించిన భగవద్గీత పారాయణ పోటీలలో స్థానిక దిబ్బలపాలెంనకు చెందిన దాకామర్రి లోవరాజు, మల్లీశ్వరి దంపతుల కుమార్తె, కుమారుడులు బంగారు పథకాలు సాధించడం గర్వ కారణమని విశ్వహిందూ పరిషత్ జిల్లా సంస్కృతి విభాగ్ ప్రముఖ్ కటకం కిరీటి అన్నారు.నాలుగవ తరగతి చదువుతున్న గహన సంయుత నాయకి జూనియర్స్ విభాగం నుండి బంగారు పథకం, ఒకటవ తరగతి చదువుతున్న యస్వీరా సూర్య కార్తీక్ సబ్ జూనియర్స్ విభాగంలో బంగారు పథకం సాధించారు. గురువారం నాడు సంకట హర చతుర్థి సందర్బంగా స్థానిక పాత బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో ఏలేశ్వరం మండల విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమంలో ఈ చిన్నారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిరీటి మాట్లాడుతూ భగవద్గీతలోని 18 అధ్యాయాలు 700 శ్లోకాలపై ఐదు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో ఏలేశ్వరం నగరానికి చెందిన అక్క,తమ్ముళ్లు బంగారు పథకాలు సాధించడంలో వారి తల్లిదండ్రుల కృషి వెలకట్టలేనిదని ప్రశంసించారు. అనంతరం సత్సంగ్ లో భాగంగా వీహెచ్పీ సభ్యులు గణపతి కళ్యాణ గానామృతం, భగవత్ గీత, దేశ భక్తి గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో మండల విహెచ్పి నాయకులు అలమండ దుర్గా వెంకట ప్రసాద్,కార్యదర్శి పి.దేవి,ఆర్గనైజర్ కే.ఇందిర, కోశాధికారి జి.సత్య నారాయణ, సహా కార్యదర్సులు గిరిజ, కామాక్షి, స్వరాజ్యం, రే్వతి, గౌరవ అధ్యక్షులు జి.మహాలక్ష్మి,శారద, లక్ష్మి టీచర్, రమ్య,బేబీ, సౌజన్య,గుర్రయ్య తదితరులు పాల్గొన్నారు.