భరోసా పార్టీ అధ్యక్షుడిపై ఉన్మాదుల అతి కిరాతక దాడిని ఖండించండీ.సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలి.ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

పయనించే సూర్యుడు తేదీ 21 రూలర్ రిపోర్టర్ బురిడీ బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రశాంతమైన స్వచ్ఛమైన ఆదివాసీ ప్రాంతం చింతపల్లిలో భరోసా పార్థి అధ్యక్షులు అభినయన్ దర్శన్ పై గుర్తుతెలియని దుండగులు,ఉన్మాదులు అతికిరాతకంగా దారుణంగా మరణ ఆయుధాలతో కాపుగాసి దాడి చెయ్యడం దుర్మార్గమని, ఈ ఘటను ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది. అరకువేలి గిరిజన సంఘం భవనంలో మీడియా సమావేశం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, స్వచ్ఛమైన జీవనవిధానానికి విఘాతం కలిగించే విధంగా, ఏజెన్సీ ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై పట్టపగలు నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు, ఉన్మాదులు దాడి చేయడం ప్రభుత్వ వైఫల్యం. కత్తులు కర్రలతో కిరాతకా దాడి చెయ్యడం హేమమైన చర్యని ఇది పథకం ప్రకారం జరిగిన హత్య యత్నం. ఇటువంటి భౌతిక దాడుల ఏజెన్సీ ప్రాంతం లో అశాంతిని సృష్టిస్తుంది. ఆదివాసీ ప్రజల్లో భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇటువంటి అరాచక సంస్కృతి ఏజెన్సీ ప్రాంతంలో లేదని, కొంతమంది వ్యక్తులు కావాలని ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి ఘటనకు కారణం అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల మీద బహిరంగంగా మాట్లాడుకునే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కపరుడు ఇచ్చిందని వీటిని జీర్ణించుకోలేక ఇంటివటి ఘటనకు కొంతమంది పూనుకుంటున్నారు. ప్రకృతి ఆరాధకులైన ఆదివాసులను కొన్ని వర్గాల వారు తమ ఆధిపత్యం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఆదివాసీ ప్రజలపై తమ మతం రంగు పూస్తున్నారు. బలవంతం రుద్దుతున్నారు. భరోసా పార్టీ అధ్యక్షులు అభినయన్ దర్శన్ పై దాడి చేసిన వారిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దాడి పై సమగ్ర సమాచారాన్ని ప్రజలకే ప్రభుత్వం తెలియజేయాలని కానీ ప్రభుత్వ ఇప్పటికే వీటిని పక్క దారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇటువంటి చర్యలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ఖండించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటన పునరుద్దరణ కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఆదివాసీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కావాలనే మతం పేరుతో ఆదివాసులను రెచ్చగొడుతున్నారని .ప్రభుత్వం వాటిని నివారించవలసిన బాధ్యత ఉందన్నారు, ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జిబాబు, పాంగి నానిబాబు తదితరులు పాల్గొన్నారు,