పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 16 ప్రభుత్వ సంక్షేమ పథకాలను భవన నిర్మాణ కార్మికులకు సక్రమంగా అమలు చేయాలని, సోమవారం రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గూడూరు పట్టణం లోని లేబర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో గెలిచి రెండు సంవత్సరములు కాలం పూర్తి కావస్తున్నా,సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడంలేదని,కార్మికుల కంటి తుడుపు కోసం నాలుగు పథకాలు అమలు చేసి,చేతులు దులుపు కుoదని, వెల్ఫేర్ బోర్డులో కార్మికులకు, ఇవ్వవలసిన డబ్బులు ఇప్పటికీ 18 లక్షల కోట్ల రూపాయలు ఖజానాలో ములుగుతూ ఉందని, ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా తీసి కార్మికులకు ఖర్చు చేసిన పాపాన పోలేదని, ప్రమాదాలు జరిగి మరణించిన వారు, వికలాంగులుగా మారిన వారు, కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని, వెంటనే బిల్డింగ్ వర్కర్స్ అందరికీ చట్ట ప్రకారంగా రావలసిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి, ఈ మాట తమ ఉమ్మడి పార్టీల "మేనిఫెస్టోలో "భద్రంగా పొందుపరిచారని,అయినప్పటికీ ఇప్పటివరకు సంక్షేమ పథకాలు గురించి ఊసేలేదులని, భవన నిర్మాణ సంఘ కార్మికులు పలుసార్లు సంక్షేమ పథకాలు ఇవ్వమని అడిగినా వాటి గురించి పట్టించుకునే నాధుడే లేరని,మరొక పక్క. పోరుగు రాష్ట్రాలైన తమిళనాడు,కర్ణాటక, తెలంగాణ,కేరళ రాష్ట్రాలలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అన్నింటిని అమలు చేస్తున్నారని, మరియు అదనంగా కొత్త పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో భవన నిర్మాణ కార్మికుల సెప్టెంబర్ నెల ముందు ప్రమాదంలో మరణించిన వారికి ఐదు లక్షల ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు అనారోగ్యం అంగవైకల్యం చెందిన కార్మికులకి రెండు లక్షల ఇవ్వాలని, గతంలో అమలు చేసిన ప్రమాద మరణానికి ఇచ్చే ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలి,వాటితో పాటు సహజ మరణానికి మట్టి ఖర్చులు, కుమార్తె పెళ్లి, కానుక ప్రసూతి ఖర్చులు ఇవ్వాలని,60 సంవత్సరాల నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6 వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం లేబర్ కార్యాలయం సీనియర్ సహాయకులు ఈ.లక్ష్మీప్రసన్నకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం గౌరవాధ్యక్షులు పుట్టా శంకరయ్య, కార్యదర్శి ఎస్.డి.రఫీ, కమిటి సభ్యులు గండికోట మధు, పి.రాజు, బి.లక్ష్మయ్య, డి.సుధాకర్, డి.మునిరెడ్డి, ఎస్.డి.హాసిన్, పీ.శ్రీనివాసులు నాయకులు జోగి శివకుమార్, బి.వి.రమణయ్య, ఎంబేటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.