పయనించేసూర్యుడు దస్తగిరి రిపోర్టర్ న్యూస్--9--6--2026 నారాయణఖేడ్ నియోజకవర్గం లో గిరిజనుల ఆరాధ్య దైవం భవాని మాత మరియు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించిన మాజీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాలో గిరిజన సాంప్రదాయాలు, భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న భవాని మాత – సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు హాజరైన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను, తండా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం భాగస్వామిగా ఉంటూ, ప్రతి గ్రామం – ప్రతి తండా అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు అలీ,సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పండరి, కృష్ణ గౌడ్, వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, రమేష్ చౌహన్, సర్దార్ నాయక్, రాములు, పార్టీ నాయకులు, భక్తులు, తండా ప్రజలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.