భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) .

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 7 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయానికి జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహానేత డా. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, యువ నాయకులు శ్రీరాం చిన్నబాబు స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ,

డా. బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత అని కొనియాడారు. సమాజంలోని అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాసేవే లక్ష్యంగా ఆయన సాగించిన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొని దేశ స్వేచ్ఛ కోసం విశేష సేవలు అందించిన ఆయన, అనంతరం కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహిస్తూ దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. వ్యవసాయ రంగం, కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన అందించిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమం, అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అణగారిన వర్గాల సాధికారత, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, అన్నెపాక దుర్గ మహేశ్వరరావు, మారేపల్లి బాషా, మార్కపూడి వంశీ,కర్ల జోజి, వల్లపుదాసు తిరుపతిరావు, మల్లెల సాయి, కోటా ప్రభోజి మరియు కౌన్సిలర్లు, వివిధ హోదాలలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

.