పయనించే సూర్యుడు, మే 22 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని సుభాష్ గంజ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జహీరాబాద్ ఇంచార్జ్ డా|| ఏ. చంద్రశేఖర్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డా|| ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం జహీరాబాద్ మునిసిపల్ కార్యాలయ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. తదుపరి జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు మరియు ఆహార పదార్థాలను పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం నర్సింలు, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్, మునిసిపల్ చైర్మన్ యూనుస్, వైస్ చైర్మన్ శిరీష రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఖాజా, కౌన్సిలర్లు జామీలోద్దీన్, మహేష్, జహంగీర్, అతీక్, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్, సర్పంచ్ రాజు, నందప్ప, భ్రమ్మానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు హుగ్గేల్లి రాములు, నాయిమ్ అహ్మద్, మొయిజ్, అరవింద్, గౌస్, బర్కత్, జనార్దన్, శాంతు, శాంసన్, అక్రమ్, ఇస్మాయిల్, ఇనాయత్, ఆయుబ్, పవన్ రాథోడ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నాగిరెడ్డి, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు