పయనించే సూర్యుడు జులై 10 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. భాష్యం విద్యాసంస్థ చైర్మన్ రామకృష్ణ ప్రోత్సాహంతో ఆదోని భాష్యం-2 పాఠశాలలో జెడ్ డి వో మాచాని కవిత అధ్వర్యంలో నిర్వహించిన "వనమహోత్సవం " కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణ, అడవుల శాతం పెంపు మరియు భూగర్భ జలాల వృద్ధిని ఆకాంక్షిస్తూ భాష్యం-2 పాఠశాల ఆధ్వర్యంలో "వనమహోత్సవ" ర్యాలీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన [తేజస్విని అడవుల పరిరక్షణ అధికారి] వనమహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్విని మాట్లాడుతూ: "ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి మొక్కలు నాటడం ఒక్కటే ఏకైక మార్గం. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని వృక్షాలుగా మార్చేంత వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కాపాడాలి. 'వృక్షో రక్షతి రక్షితః' అనే నానుడిని నిజం చేస్తూ ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు లేదా ముఖ్యమైన రోజులలో కనీసం ఒక మొక్కనైనా నాటాలి." అని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ రవిప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా నీడను ఇచ్చే చెట్లు, పూల మొక్కలు మరియు ఔషధ గుణాలున్న మొక్కలను గురించి తెలియ చేశారు. ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ రవిప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ అంజినేయులు మరియు హెచ్ఎం రేవతి ఉపాధ్యాయులు అందరూ కలిసి నిర్వహించారు. ప్రకృతిని రక్షిద్దాం - భావితరాలకు పచ్చదనాన్ని అందిద్దాం ఘనంగా వనమహోత్సవ వేడుకలు.
.
