పయనించే సూర్యుడు ,జూలై 09 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ సారపాక: మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని భాస్కర్నగర్కు చెందిన భూక్య బద్యకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రేకుల షెడ్ నిర్మాణానికి మంజూరైన రూ.60,024 విలువైన చెక్కును గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సిబ్బంది, ప్రజా ప్రతినిధి లో పాల్గొన్నారు