భీంగల్ పట్టణంలో ఘనంగాఊర పండగముడుపు వేసే కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ జులై :7 రిపోర్టర్. కొత్వాల లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం భీమ్గల్ గ్రామంలో స్థానిక బొదిరే గల్లీలోని మైసమ్మ ఆలయంలో సాయంత్రం.4 గంటలకు ఆదివారం రోజున పట్టణంలో ఊర పండుగ ఏర్పాట్లలో భాగంగా ఈ ముడుపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో భీమ్ గల్ పట్టణ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది సర్వ సమాజ అభివృద్ధి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఊర పండుగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహంతో మొక్కిన భీంగల్ ప్రజలు ముడుపు వేసే కార్యక్రమం ఈ నెల 12న నిర్వహించనున్న సాంప్రదాయ ఊర పండుగను పురస్కరించుకుని జులై 5వ తారీకు ఆదివారం ముడుపు వేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సర్వ సమాజ కమిటీ అధ్యక్షులు పతాని కృష్ణ, కమిటీ సభ్యులు తెలిపారు. 05 2026 సమయం: సా. 4:00 గంటల నుండి స్థలం: శ్రీ మైసమ్మ ఆలయం, బొదిద్రే గల్లి, భీమ్ గల్. ఊర పండుగ అనేది గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రాముఖ్యత కలిగిన సాంస్కృతిక మరియు మతపరమైన వేడుక. ఈ పండుగను ప్రధానంగ గ్రామ, పట్టణ క్షేమం కోసం గ్రామదేవతల (పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ) ఆశీస్సుల కోసం నిర్వహిస్తారు.

.

కార్యక్రమ వివరములు :-

నిజ జ్యేష్ఠ మాస బహుళ పంచమి తేది: 05-07-2026 ఆదివారం రోజున 'ముడుపు వేయడం " జరుగుతుంది. నిజ జ్యేష్ఠ మాస బహుళ దశమి తేది: 09-07-2026 గురువారం రోజున “ఆరె ఎత్తడం" జరుగుతుంది. నిజ జ్యేష్ఠ మాస బహుళ త్రయోదశి తేది: 12-07-2026 ఆదివారం రోజున "ఊర పండుగ" నిర్వహిస్తున్నాము. నిజ జ్యేష్ఠ మాస బహుళ చతుర్దశి తేది: 13-07-2026 సోమవారం రోజున “ గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన " జరుగుతుంది. కావున దయచేసి ఇట్టి మహత్కార్యంలో మీరు తప్పకుండా పాల్గొని గ్రామదేవతల ఆశీస్సులు పొందగలరని సహృదయంతో ఆహ్వానిస్తూ, తప్పకుండా పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నాము.

.

ఆహ్వానితులు :
సదా గ్రామ సేవలో… భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటి-

.