పయానించే సూర్యుడు న్యూస్ జూన్ 8 మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నన్స్పూర్ మండలం సీసీసీ కార్నర్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నస్పూర్ మండల అధ్యక్షులు బూర రవీందర్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ పాల్గొని,జులై 5న భువనగిరి లో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మహేష్ వర్మ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సాధనకై సమరశంఖం పూరించేందుకు ఉద్యమాల పోరుగడ్డ అయిన భువనగిరిలో "బెల్లి లలితా ప్రాంగణం"లో లక్షలాదిమంది బహుజనులతో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సారథ్యంలో,తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సభ నిర్వహించడం జరుగుతుంది.ఈ సభ విజయవంతంలో బహుజనులు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న 18మండలాల్లో ఉన్న బహుజన మేధావులు ముందుకు రావాలని కోరారు.రానున్నది బీసీల రాజ్యమే అని అన్నారు. అధికారం, ఆత్మగౌరవం, వాటా నినాదంతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ,తీన్మార్ మల్లన్న ద్వారానే బహుజనుల అజ్యాధికారం వస్తుందని, మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ నిర్మాణం చేసుకుందామని,ఇందులో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా నాయకులు మహేష్ వర్మ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లతీఫ్ జిల్లా కార్యదర్శి పడాల శివతేజ, నస్పూర్ మండల నాయకులు బొంగోని విద్యాసాగర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.