పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-04 భూపాలపల్లి డివజన్లో సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ కార్మికుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ వేతనాలు, యూనిఫాంల పంపిణీ, గతంలో పెరిగిన వేతనాల ఏరియర్లు మరియు ఇతర సమస్యలపై చర్చించారు.కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం చొరవ తీసుకుని కృషి చేస్తానని ఏ. వెంకన్న హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సీహెచ్. నరసింగంతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.