మంచినీటి ఎద్దటి సమస్య పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు ఇచ్చిన ఏపీ ఆదివాసీ జేఏసీ బృందం.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జూన్.16.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ గ్రీవెన్స్ హాల్ నందు సోమవారం నాడు పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ కి ఏపీ ఆదివాసీ బృందం వినతి పత్రాలు అందజేస్తామని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…పోలవరం జిల్లా,దేవీపట్నం మండల పరిధిలోని పాతది చిన్న రమణయ్య పేట గ్రామపంచాయతీ,కొత్తది దేవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామస్తులైన 1.దండంగి 2.గంగంపాలెం 3.మూలపాడు 4.తోయ్యేరు గ్రామాలలో సుమారు 993 కుటుంబాల ప్రజలకు త్రాగడానికి మంచినీళ్లు లేక సుమారు ఇదే సంవత్సరం మార్చి చివరివారం నుండి జూన్ మూడో వారం వరకు సుమారు మూడు నెలల నుండి మంచి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.మంచినీళ్లు తెచ్చుకునేందుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందుకూరుపేట గ్రామం,పోతవరం గ్రామాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. బాలింతలు వృద్ధులు,వికలాంగులు మంచినీళ్లు తెచ్చుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.నాలుగు గ్రామాలకు కలిపి ఒకటే చేతి పంపు పని చేయడంతో గృహ అవసరాలకు వాడుకునే నీళ్లకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.కావున భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆదివాసీ ప్రజలు జీవించే హక్కును కాపాడాలని కోరుతూ…పోలవరం జిల్లా మెజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ కి తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని.మరియు ఇటీవల విడుదలైన పెద్ది సినిమా హీరో మరియు దర్శకుని పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతి పత్రాలు అందజేశామన్నారు.అలాగే ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో ఆదివాసీ సమాజాన్ని అవమానపరిచి వారి మనోభావాలను కించపరిచేలా ఉన్న భాష మరియు వివాదస్పద డైలాగులను తక్షణమే తొలగించి పెద్ది సినిమా హీరో,దర్శకుని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.చేసి చట్టపరమైన తీసుకోవాలని భారత రాజ్యాంగంలో ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు హక్కులు సమాన అవకాశాలు కల్పిస్తే నేటి తరంవారు వాటిని తుంగలో తొక్కుతుంది.కావున పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు పై హీరో రామ్ చరణ్ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శరభవరం,దేవారం ఎంపిటిసి తుర్రం జగదీష్ దొర,మాజీ ఎంపీటీసీ కర్రీ అబ్బాయి రెడ్డి,పండా సిద్దార్థ దొర (ఎల్.ఎల్.బి), మిర్తివాడ వీర రెడ్డి,కొమరం కృష్ణ దొర,చవలం విద్యాసాగర్ భారత్ ఆదివాసీ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ ప్రచార కార్యదర్శి,కోసు సోమన్న దొర,ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు,తుర్రం చంద్రరావు దొర మొదలైన వారు పాల్గొన్నారు.