పయనించే సూర్యుడు న్యూస్ మే 28 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా మరియు నియోజకవర్గం నాగార్జున కాలనీ 25 వ డివిజన్ లో జిల్లా ఇంచార్జ్ చంద్రమోహన్ గౌడ్ మరియు నియోజక వర్గ ఇంచార్జ్ ఐతే ప్రశాంత్ నేతృత్వం లో రసకొండ సురేష్-లక్ష్మిపావని ఆధ్వర్యంలో సి సి సి అంబేద్కర్ విగ్రహం కు పూలమాల అర్పించి ర్యాలీతో నాగార్జున కాలనీ 25వ డివిజన్లో తెలంగాణ రక్షణ సేనా జండా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హెచ్ ఎం ఎస్ నాయకులు తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి ఉదరీ చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేనా చీఫ్ కల్వకుంట్ల కవిత అక్కా ప్రకటించిన పాంచజన్య పథకాల గురించి ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలని అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని మండలాలలో తెలంగాణ రక్షణ సేన జండా పండుగను విజయవంతంగా పూర్తి చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ జండా ఎగరవేయడమే మా నాయకుల లక్ష్యమని పేర్కొన్నారు. కవితక్క ఈ జెండా పండుగతో కార్యకర్తలకు ఒక ఉత్సాహబలాన్ని చేకూర్చాలని రాబోయే అన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీ గ్రామస్థాయి నుంచి బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలు నాయకులకు ప్రేరూపణ కలిగించే విధంగా అన్ని కార్యక్రమాలలో ముందుండి నడిపిస్తానని ఆయన మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రక్షణ సేన నాయకులు జిల్లా అధ్యక్షులు ఉదారి చంద్రమోహన్ గౌడ్ మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జి ఐత ప్రశాంత్, హెచ్ ఎం ఎస్ నాయకులు సారన్న, మంచిర్యాల జిల్లా జాగృతి మాజీ అధ్యక్షులు ప్రేమ్ రావు,చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి వడ్లకొండ రాజేష్,మేడి రాజశేఖర్,బెల్లంపల్లి ఇంచార్జ్ సజన్,స్రవంతి మంచిర్యాల జిల్లా మహిళా విభాగానికి నుండి సంధ్యారాణి,జిల్లా నాయకులు రామ్మోహనచారి, సందీప్ గౌడ్,సంపత్,అనిల్, వేముల సాయి కుమార్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…