మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సహారా ఇండియా కార్యాలయం ముందు బాధితుల ఆందోళన

చెల్లించిన డిపాజిట్లను వెంటనే వడ్డీతో సహా వాపస్ చేయాలని డిపాజిట్ దారుల డిమాండ్.

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి సహారా ఇండియా కార్యాలయం లో సహారా బాధితులు మేము చెల్లించిన డిపాజిట్లు కాల పరిమితి దాటి పోయిన మా డిపాజిట్లను వెంటనే చెల్లించాలని నల్ల బ్యాడ్జిలు ధరించి ప్లే కార్డ్స్ పట్టుకొని ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా సహారా కార్యాలయం లోని సిబ్బంది కి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సహారా బాధితుడు మాట్లాడుతూ మేము కష్టపడి పైసా పైసా పోగేసి కూడ పెట్టుకుని సంపాదించిన లక్షలాది రూపాయలను సహారా సంస్థ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి సింగరేణి విశ్రాంత ఉద్యోగులు వయోవృద్ధులు ఒంటరి మహిళలు,కూలీ నాలి చేసుకునే మధ్యతరగతి ప్రజలు చిరువ్యాపారస్తులు సహారా ఇండియా సంస్థ లో కోట్లాది రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కాల పరిమితి దాటి పోయి 3-4 సంవత్సరాలు గడుస్తున్నా పాలసీలు మెచ్యూరిటీ లు పూర్తయిన లక్షలాది మంది సహారా బాధితులకు వారి డబ్బులు చెల్లించడంలో జాప్యం లో భాగంగా సహారా ఇండియా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సహారా ఇండియా సంస్థ లో మేము డిపాజిట్ చేసిన డబ్బులను వెంటనే చెల్లించాలని,లేని యెడల మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న సహారా ఇండియా కార్యాలయాల ముందు సహారా బాధితులు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే,ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరుగుతుంది అని సహర యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినారు.కోట్లాది మంది సహారా ఇండియా బాధితుల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి అదే విధంగా మన పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీ కృష్ణ సహారా బాధితుల సమస్యల పైన వెంటనే స్పందించి వారికి వెంటనే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు,సహారా బాధితుడు,బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య,సహారా బాధితులు వేముల కనకయ్య,దోవనపల్లి వెంకన్న,వేముల సతీష్ కుమార్,ఎం రాజమౌళి,టీ వెంకటేశ్వర్లు సహారా ఇండియా డిపాజిట్ చేసిన బాధితులు పాల్గొన్నారు.