మంచిర్యాల పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క

★ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల,పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి ★ సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన విశ్రాంత ఉద్యోగుల సంఘం

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోస్తవానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసినట్టు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సమావేశంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ ప్రధాన డిమాండ్ లైన సిపిఎంఆర్ఎస్ హెల్త్ కార్డు ను 8 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచాలని పెరిగిన గ్రాడ్యూటీ సీలింగ్ 20 లక్షలు 2017 నుండి చెల్లించాలని,గత 25 సంవత్సరాల నుండి పెంపుదలకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్ పెంచే విధంగా కృషి చేయాలని అర్హులైన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు మంజూరు చేసి వృద్ధాప్యంలో ఆర్ధిక బరోసా కల్పించాలని,తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ప్రయోజనాలను విశ్రాంత ఉద్యోగులకు అందేలా చేయాలని సొంత గృహాలు లేని విశ్రాంత ఉద్యోగులకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని సింగరేణి లో మారు పేర్లను వెంటనే సరి చేయాలని ఏరియా హాస్పిటల్ లలో గోల్డెన్ షేక్ పెట్టుకున్న విశ్రాంత ఉద్యోగులకు బీపీ షుగర్ తదితర వ్యాధులకు సంబంధించిన మందు గోలీలను ప్రతి నెల ఇవ్వాలని ఖాళీగా ఉన్న సింగరేణి కోటర్లను విశ్రాంత ఉద్యోగులకు కేటాయించాలని తదితర డిమాండ్ లను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఈరోజు జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కి వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందని తెలియజేశారు.ఈ సమావేశంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య,అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న,ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య,ఉపాధ్యక్షులు ఏ గంగయ్య,ఆర్గనైజింగ్ కార్యదర్శి కాటం లక్ష్మణ్,నాయకులు జే రాజన్న,జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు…