మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

అమరవీరుల త్యాగాలను కొనియాడిన వక్తలు

పయనించే సూర్యుడు, జూన్ 3, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సిద్ధించి 12 సంవత్సరాలు గడుస్తుందని అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలతో జెండా ఆవిష్కరణ ప్రదేశాలు మారు మ్రోగాయి. వక్తలు అమరుల త్యాగాలను కొనియాడారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద అల్వాల నరసింగరావు, పిఎసిఎస్ లో పులిగిల్ల పూర్ణచందర్, పి హెచ్ సి లో డాక్టర్ శ్రీనివాస్, పార్టీ గద్దెల వద్ద వివిధ పార్టీల అధ్యక్షులు జెండా ఎగరవేసారు.