మండ్రాజుపల్లి కొత్తూరు లో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు .

పయనించే సూర్యుడు… న్యూస్.03.. నేలకొండపల్లి మండలం మండ్రాజూపల్లి లోని స్థానిక రామాలయం లో ధ్వజస్తంభ ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడాలి గోవింద రావు హాజరయ్యారు.ఈసందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,పాడి పంటల తో కళకళలాడాలని దేవున్ని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,నాయకులు నెల్లూరి భద్రయ్య,వజ్జా శ్రీను,నంబూరి రామారావు, సర్పంచ్ లావూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు