(పయనించే సూర్యుడు మే 7 రాజేష్ దౌల్తాబాద్ ) దౌల్తాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి ని కలిసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దౌల్తాబాద్ ఏఎంసి చైర్మన్ కనకయ్య, వైస్ చైర్మన్ స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌల్తాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్ లో శనివారం దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య,వైస్ చైర్మన్ మద్దెల స్వామి,మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు, మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.మంత్రిని కలిసిన వారిలో తప్పెట సుధాకర్ ముదిరాజ్, జాల దుర్గాప్రసాద్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.