మందుబాబులకు నిలయంగా మారిన బస్ షెల్టరు

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్13 రెట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కోట. చీలు రోడ్డు, కడివేడు గ్రామ పంచాయతీకి వెళ్లే దారిలో బస్సు షెల్టర్లో చెత్త చెదారంతో నిండిపోయి మందుబాబులకు నిలయంగా మారిందీ. పక్కనే కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నందున ఇక్కడే మందుబాబులు. బస్ షెల్టర్ లో కూర్చుని మద్యం సేవిస్తు మద్యం బాటిళ్లు అక్కడే పడే వేస్తున్నారు. రెట్టపల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ చిల్లకూరు మండలం ఎంపీడీవో తమ సిబ్బందిచే బస్సు షెల్టర్ లో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉంచవలసిందిగా ఆయా ప్రాంతాల ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు