మంద కృష్ణ మాదిగ జన్మదినం, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం: ఎమ్మార్పీఎస్ నాయకుల పిలుపు

పయనించే సూర్యుడు జులై 05, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చింతకాని మండలంలో సంస్థ బలోపేతం, మంద కృష్ణ మాదిగ జన్మదినం మరియు ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై విస్తృత పర్యటన చేపట్టారు. మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చిర్రా ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చింతకాని మండల ఇన్‌చార్జి రవీంద్ర పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి మాదిగ పల్లెలో మంద కృష్ణ మాదిగ జన్మదినాన్ని, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన విస్తృత పర్యటన అనంతరం బొప్పారం గ్రామంలో మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వర్గీకరణ సాధన కోసం నిరంతరం పోరాడిన మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో స్థాపించబడిన ఎమ్మార్పీఎస్ నేడు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సంక్షేమ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమంగా ఎదిగిందన్నారు. అలాంటి నాయకుడి జన్మదినాన్ని, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మాదిగ పల్లెలో జెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ, ఉదయ్ రామ్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.