మధ్యాహ్న భోజన పథకానికి వంట గిన్నెలు అందజేత

పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలపెల్లి వేణు రావు,

పయనించే సూర్యుడు న్యూస్ :జులై/05: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలపెల్లి వేణు రావు, మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. గతంలో కూడా పాఠశాలకు అవసరమైన పలు వస్తువులు అందించి అభివృద్ధికి చేయూతనిచ్చిన ఆయన, తాజాగా మధ్యాహ్న భోజన నిర్వహణ కోసం అవసరమైన వంట గిన్నెలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ, చింతలపెల్లి వేణు రావు అందిస్తున్న సహాయ సహకారాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. గ్రామస్థులు కూడా ఆయన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజయ్ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.