మన్యం వీరుడి త్యాగాలు మరువరాదు : యల్లటూరు

పయనించే సూర్యుడు-05-07-2026-రాజంపేట న్యూస్ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాలను మరువరాదని జనసేన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస్ రాజు అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రాజంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి గజమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యల్లటూరు మాట్లాడుతూ ధైర్య సాహసాలకు అల్లూరి సీతారామరాజు పెట్టింది పేరని, దేశ యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు త్యాగాలను యల్లటూరు శ్రీనివాసరాజు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.