మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.. ఎస్పీకి ఫిర్యాదు..

పయనించే సూర్యుడు జూన్ 9, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన శంకువరానికి చెందిన కర్రీ రామారావు, కర్రీ వెంకటరమణ కర్రీ వీరబాబు.. వివరాల్లోకెళ్తే.. కాకినాడ జిల్లా శంఖవరం కు చెందిన కర్రి వెంకటరమణ కర్రీ రామారావు కర్రీ వీరబాబులకు చెందిన 54 గజాల స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు తన్నీరు రాజశేఖర్ తన్నీరు సుశీల కర్రీ లోవరాజు కర్రి సురేష్లు ప్రయత్నిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని మాకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ సెల్లో సోమవారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కర్రీ రామారావు మాట్లాడుతూ మాకు వచ్చిన స్థలము ఉందని అతని దానికి సంబంధించి పన్ను, కరెంటు బిల్లు తో పాటు అన్ని ఉన్నాయని అయితే ఇంజక్షన్ ఆట కూడా ఉందని అయినా సరే వీరు జెసిబి ని తీసుకొచ్చి షాపును పడగొడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దీంతో ఎస్పీని ఆశ్రయించమని ఆయన స్పందించి మీకు న్యాయం చేస్తామని తెలిపారని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వారు తెలియజేశారు