మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, వి బి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

సిఐటియు మండల కార్యదర్శి బి.రాము

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 22 వత్సవాయి మండల కేంద్రంలోని పలుచోట్ల ఉపాధి హామీ కార్మికులను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకుంటున్న బృందం సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి, జీవనోపాధులు హామీ కార్యక్రమం (విబి-రామ్ బి)తో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పుడున్న అరకొర ఉపాధికి కూడా ఇది ఉరితాళ్లు బిగిస్తోంది. మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, గ్రామీణ కార్మికులను కార్పొరేట్ శక్తులకు చౌక శ్రమగా మార్చడానికి పద్దతి ప్రకారం దీనిని బలహీనపరుస్తోంది. విబి జి రామ్ జీ అనేది పని హక్కును కాలరాసే ఒక ప్రమాదకరమైన విధానం. ఇది ఉపాధి కల్పించే చట్టం కాదు. నిరుద్యోగం, ఆకలి చావులు, వలసలు, మరణాలకు గ్యారంటీ ఇచ్చే విధానం. పేరుకి 125 రోజులు పని దినాలు కల్పిస్తున్నాం అన్న 60 రోజులు వ్యవసాయ సీజన్లో నిషేధించారు. దీని వలన పని దినాల తగ్గుతుంది, పాత చట్టంలో 90% నిధులు కేంద్రం వాటా మంజూరు చేసేది. కొత్త చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్రం రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలని కొత్త చట్టం చెబుతుంది. దీనివల్ల సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వేతనాల వల్ల తీవ్ర ఉపాధి సంక్షోభాన్ని ఎదుర్కొవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీని బలహీనపరచడంతో పాటు గ్రామీణ పేదల జీవనోపాధి హక్కుపై ప్రత్యక్ష దాడి చేయడమే. సాంకేతికత పేరుతో కార్మికులను పనికి దూరం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం, రోజుకు రెండుసార్లు డిజిటల్ హాజరు, పని ప్రదేశాలలో కార్మికుల ఫోటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలనే నిర్బంధ విధానాలను తీవ్రంగా ఖండించాలి. డిజిటలైజేషన్ ముసుగులో పేదలను అవమానించడం, వారికి ఉపాధిని నిరాకరించడం అమానవీయమని, కార్మిక వ్యతిరేకమని స్పష్టం చేశారు. "పని హక్కుపై దాడి అంటే పేదల జీవించే హక్కుపై దాడే, రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం సమిష్టిగా ఈ దాడులను తిప్పికొట్టాలి. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం . విధానాలను వ్యతిరేకించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్షాకార సంఘం నాయకులు వై వెంకటరత్నం, కె.వెంకటేశ్వర్లు పుల్లయ్య,. బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు