పయనించే సూర్యుడు న్యూస్ జూలై 08 యడ్లపాడు మండల ప్రతినిధి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీ (బుధవారం) ఉదయం 10:00 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని అధ్యక్షతన కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు యడ్లపాడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డేపల్లి నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా యడ్లపాడు మండలంలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే పరిసర గ్రామాల వైఎస్సార్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఘన నివాళులర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మహానేత ఆశయాలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు….