మహిళల స్వాలంభన సర్కార్ ధ్యేయం *(92 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ :మే /28:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మహిళల స్వావలంబన ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణన అన్నారు. మంగళవారం మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో నూతనంగా చేపట్టిన వీవో భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాలకు ప్రోత్సాహం అందిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు మరింత బలోపేతం కావడానికి అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎంపీడీవో వీవీ వరలక్ష్మి, వెల్ది గ్రామ సర్పంచ్ పెంచాల కిషన్ రావు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎన్ బాపు రావు, జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ ఆర్. తిరుమల్, పార్టీ నాయకులు గుజ్జ ప్రభాకర్, బక్కారెడ్డి తోపాటు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 92 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 92 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. 25వ విడుతలో మానకొండూర్ మండలంలోని 92 మందికి 22,87,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు కాగా, వాటిని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీవీ వరలక్ష్మి, తహసీల్దార్ విజయకుమార్, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, 7.వ డివిజన్ అధ్యక్షుడు బండి మల్లేశం, పార్టీ నాయకులు మడుపు ప్రేమ్ కుమార్, ఇర్ఫాన్, కోండ్ర సురేష్, సాయిరి దేవయ్య, రామిడి తిరుపతి,బుర్ర శ్రీధర్ గౌడ్, కనకం కుమార్, చిరంజీవి, సహదేవ్,ఎడ్ల శ్రీధర్, రామకృష్ణ,తమిశెట్టి రాజేశ్, కానిగంటి రమేశ్, నాగిశెట్టి రాజయ్య, దూలం దేవేంద్ర,వీరస్వామితోపాటు వివిధ గ్రామాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.