మహిళ శక్తి రైతు సేవా కేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు, జూన్ 3, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కేంద్రంలో మహిళా శక్తి రైతు సేవ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అల్వాల శిరీష ప్రశాంతల మహిళా శక్తి రైతు సేవ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శరత్ చంద్ర మరియు ఏపీఎం రవి పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా శక్తి,రైతు అభివృద్ధికి బలం, మన భూమి మన సంపద మన భవిష్యత్తు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా సాధికారిక రాష్ట్రంగా నిలవాలని రైతులకు పంట సాగు విషయాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ రాజేష్, మాజీ సర్పంచ్ బాలకిషన్ గౌడ్, గౌతమి సంఘం అధ్యక్షురాలు అల్వాల సంపూర్ణ, సిఏ కర్రే రాజు, సీసీలు మానేపల్లి నర్సింలు, యాదగిరి గ్రామ ఉపసర్పంచ్ బైరి రజిత వెంకటయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.