పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 7 పలాస నియోజకవర్గం రత్నాల రమేష్.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా శనివారం వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద వజ్రపుకొత్తూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అనుబంధ విభాగాల నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకుంటే చాలు "సూపర్ సిక్స్ అమలు చేశాం, ప్రజలందరికీ అన్నీ ఇచ్చేశాం" అని చెబుతున్నారు. కానీ నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నానన్నారు.50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్క బీసీ అయినా 50 ఏళ్లు దాటిన కారణంగా పెన్షన్ పొందుతున్నారా?నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని చెప్పారు. ఈరోజు ఒక్క నిరుద్యోగ యువకుడికైనా ఆ భృతి అందుతోందా?2014లో "ముఖ్యమంత్రి యువనేస్తం" పేరుతో యువతను మోసం చేశారు. ఇప్పుడు పేరు మార్చి మళ్లీ అదే హామీ ఇచ్చి యువతను మోసం చేశారు. అప్పటి మోసం ఒకటైతే, ఇప్పటి మోసం మరింత పెద్దది.అక్కచెల్లెమ్మల వద్దకు వెళ్లి నెలకు రూ.1,500 ఇస్తామని, సంవత్సరానికి 18 వేల రూపాయలు అందిస్తామని బాండ్ పేపర్లతో హామీలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్క మహిళకైనా ఆ డబ్బు అందిందా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ఆయన అభ్యర్థించారు.ప్రతి హామీని పీపీపీకి లింక్ చేశామని చెబుతున్నారు. కానీ ఆ పీపీపీ అంటే ప్రజలకు ఉపయోగపడే పథకం కాదు, ప్రజలను మభ్యపెట్టే మరో మోసం మాత్రమే అని ఈరోజు స్పష్టం అవుతుందని ఆయన విమర్శించారు.గత కొద్ది రోజులుగా డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది నిజంగా సెలక్షనా, కలెక్షనా అన్న సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. క్రీడా కోటా పేరిట జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలనుీ. పేకాటను కూడా క్రీడగా సమర్థించే పరిస్థితి రావడం విచారకరమనీ, రేపు పేకాట ఆడేవారు కూడా "మేము పేకాట కాదు, బ్రిడ్జి ఆడుతున్నాం" అంటే ప్రభుత్వం ఏం చెబుతుందో ప్రజలు తెలుసుకోవాలి ఆయన అన్నారు..రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే, పలాస నియోజకవర్గం పరిస్థితి మరో ఎత్తు. బెండిగేటు ప్రాంతంలో వందల ఎకరాలు చదును చేసి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాడికొండ ప్రాంతంలో కూడా ఆక్రమణలపై ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ వాటిపై స్పందన లేదని విరుచుకుపడ్డారు.మేము జగనన్న ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి నిర్మించిన రోడ్ల వద్ద ఫోటోలు దిగుతూ వాటిని తమ విజయాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప ఈ రెండేళ్లలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే శిరిష ను ప్రశ్నించారు.కాశీబుగ్గ నుంచి అక్కుపల్లి మీదుగా వజ్రపుకొత్తూరు వరకు, నువ్వులరేవు నుంచి టెక్కలి పట్నం వరకు రహదారులు, ఉద్దానం ప్రాంత అభివృద్ధి, మూలపేట పోర్టు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, రైతుల కోసం చేపట్టిన ప్రాజెక్టులు, 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తాగునీటి పథకాలు,ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టినవే. అక్కుపల్లి, బైపల్లి, చిన్నవంక, బాతుపురం, డోకులపాడు గ్రామాల్లో డ్రైన్లు నిర్మించి రోడ్లు వేశాం. కానీ ఇప్పుడు డ్రైన్లు లేకుండా రోడ్లు వేసి మొదటి వర్షానికే పాడయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజల అవసరాల కంటే ప్రచారమే ముఖ్యమైపోయిందని వివరించారు.ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకు అభివృద్ధి కంటే కలెక్షన్లపైనే ఎక్కువ దృష్టి ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నెలలో ఎక్కువ రోజులు విశాఖపట్నంలో ఉంటూ, నెలకోసారి పలాసకు వచ్చి గ్రావెల్ మాఫియా, మట్టి మాఫియా, మద్యం అక్రమ వసూళ్ల వ్యవహారాల నుంచి కలెక్షన్లు తీసుకుని తిరిగి వెళ్తున్నారనే విమర్శలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయని అన్నారు.మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఒక్క సమాధానం కూడా రావడం లేదు. రోజుకు సుమారు రూ.3 లక్షలు, నెలకు దాదాపు రూ.1 కోటి వరకు ప్రజల జేబుల నుంచి అదనంగా వసూలవుతోందనే ఆరోపించారు.ఈ నియోజకవర్గంలో మద్యం బాటిల్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ నేను చెబుతున్నాను… ఎమ్మార్పీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ప్రశ్నించండి. మీరు అదనంగా చెల్లించిన ప్రతి రూపాయి ఎవరి జేబులోకి వెళ్తుందో ఆలోచించండని అన్నారు.మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపేది లేదు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరవేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ ప్రజా ప్రభుత్వం రావాలనే సంకల్పంతో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి అభిమాని ప్రజల మధ్య పోరాటం కొనసాగిస్తారని తెలిపారు.ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వజ్రపుకొత్తూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలందరికీ ఈసందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.