పయనించే సూర్యుడు, జులై 09 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ప్రజా సంక్షేమం, మానవతా విలువలు,నిస్వార్థ ప్రజాసేవ కు చిరస్మరణీయ నిదర్శనమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి.జగదీ శ్వర్ గౌడ్ పేర్కొన్నారు. దృఢ సంకల్పం, అంకితభావం, కష్టపడే తత్వం,ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉంటే జీవితంలో ఏ శిఖరా న్నైనా అధిరోహించవచ్చని ఆయన అన్నారు.ముఖ్యంగా విద్యార్థులు,యు వత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశ యాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చా రు.డాక్ట ర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయం తి సందర్భంగా మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నే నరేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన జయంతి కార్యక్రమంలో వి. జగదీశ్వర్ గౌడ్ చే బర్త్ డే కేక్ ను కట్ చేయించారు.ఎం బీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జై పాల్ , మైనారిటీ నేత ఇలియాస్ షరీఫ్, నడిమింటి కృష్ణ,కాంగ్రెస్ నాయకులు, మన్నేపల్లి సాంబశివరావు,యలమంచి ఉదయ్ కిరణ్, ఫయాజ్ , దుర్గం శ్రీహరి గౌడ్, తాండ్ర రామచందర్ గౌడ్, మన్నే విజయ్ ముదిరాజ్, కవిరాజ్, సౌందర రాజన్, దోర్నాల రవి కుమార్, దుర్గేష్ , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ హపీజ్ పటేల్, విజేత కళాశాల విద్యా ర్థులుప్యాకల్టీ, ఇంచార్జీలు ఫరినా,ప్రభా కర్ లు తో పాటు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలను సమర్పించి జయంతి వేడుకలను జరుపుతూ, ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లా డుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.ఆర్థిక ఇబ్బం దులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డం కి కాకూడదనే సంకల్పంతో ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశా రని తెలిపారు.విద్య ద్వారా వ్యక్తి జీవితమే కాకుండా కుటుం బం, సమాజం, రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుతుందనే విశ్వాసంతో ఆయన పాలన సాగిందని అన్నారు.