మానకొండూర్ దర్గాలో ఘనంగా బక్రీద్ వేడుకలు – ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,

పయనించే సూర్యుడు న్యూస్ :మే /29:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని దర్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ,పాల్గొని ముస్లిం సోదరులకు హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్గాకు చేరుకున్న ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,కి ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు, యువకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన దేశంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొని ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని పేర్కొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, మానవత్వం, సోదరభావానికి ప్రతీక అని అన్నారు. అన్ని మతాల పండుగలు మన సంస్కృతిలో ఐక్యతకు ప్రతిబింబమని, పరస్పర గౌరవ భావనతో సమాజం ముందుకు సాగాలని సూచించారు. ప్రజల మధ్య సోదరభావం పెంపొందించడంలో ఇటువంటి పండుగలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. బక్రీద్ సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లీం సోదరులకు “ఈద్ ముబారక్” తెలియజేసిన ఎమ్మెల్యే, ముస్లీం సోదరులు శాంతి, సామరస్యాలకు ప్రతీకలుగా నిలుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. బక్రీద్ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలు నింపాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ముస్లిం సోదరులు విద్య, ఉపాధి రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ యువత మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారం, ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ముస్లీం పెద్దలు, యువకులతో కలిసి పరస్పరం అలయ్ బలయ్ తీసుకుంటూ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దర్గాలో భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఆప్యాయంగా ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధ్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు ఇర్ఫాన్, మడుపు ప్రేమ్ కుమార్, నరేష్, కోండ్ర సురేష్, శంకర్, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, బుర్ర శ్రీధర్, కనకం అశోక్, సహదేవ్ తోపాటు ముస్లీం పెద్దలు, యువ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.