03 Nov 2026 | 12:56 AM

మానేరు తీరాన జానపదాల జోరు.. సిరిసిల్ల వేడుకలకు తరలివెళ్లనున్న ఉమ్మడి పాలమూరు జిల్లా కళాకారులు

పయనించే సూర్యుడు నవంబర్ 3, రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలను ఘనవిజయవంతం చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా కళాకారులకు నిర్వహకులు పిలుపునిచ్చారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు తీరాన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తేదీ: 03 నవంబర్ 2026, మంగళవారం సాయంత్రం 4గంటల నుండి ఈ ఆవిర్భావ వేడుకలు (ఫోక్ ఫెస్టివల్) అత్యంత వైభవంగా జరగనున్నాయి. "మానేరు తీరాన మట్టి పాటల హోరు - నాలుగు గంటల జానపదాల జోరు" నినాదంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో కళాకారులు తరలి రావాలని,జానపద కళలను, కళాకారులను ప్రోత్సహించే వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.