మామిడి రైతుకు అండగా దావ వసంత

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 28 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన రైతు లావుడ్య సురేష్ మామిడి తోట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై జగిత్యాల జిల్లా తొలి తాజా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బుధవారం తోటను పరిశీలించారు. బాధిత రైతును పరామర్శించి ధైర్యం చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రైతుకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బర్కం మల్లేష్, మాజీ సర్పంచ్ లావుడ్య నందునాయక్, నాయకులు మారంపెల్లి సాయికుమార్, అంగోత్ తిరుపతి, వాసాల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.