
పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 9 వత్సవాయి మండలం అల్లూరుపాడు గ్రామంలో చోటుచేసుకుంది ఒకవైపు పూర్తిగా ధ్వంసం అయిపోయిన రోడ్డు మరోవైపు రోడ్డుకు ఆ నుకొని కోడి కాళ్లు తల పేగులు, పూర్తి వ్యర్థాలతో మురీగిపోయి దుర్వాసనలు వెదజల్లుతూ ప్రజలకు రోగాలను గురి చేసే విధంగా ఉన్నది ఇది కేవలం కలం సోదరులకే కంట పడుతుందా అధికారులకు ఎందుకని కంటపడని దృశ్యంగా మారింది అయితే ఇంతకు ప్రజలు చెప్పుకునే మాటలు సత్యమేనని పటాపంచలై పోయింది ఇంతటి దారుణం చోటు చేసుకుంటే సంబంధిత అధికారులు మౌనం పాటించడంలో వారికి గట్టిగా ముడుపులు అందుతున్నాయి అని ప్రజల ఆ నోట ఈ నోట వార్త వినికిడిలోకి వస్తున్నది నిజమేనని స్పష్టం అవుతుంది ఇటువంటి వ్యర్ధాలను వేసి చేపలుపెంచుతూ ప్రజలను రోగాలకు గురి చేస్తున్న వారిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా ముఖ్య విన్నపము
అయ్యా అధికారులు ఒకసారి ఆ పరిసర ప్రాంతాలలో రెండు నిమిషాలు నిలబడి చూడండి మీకే జ్ఞానోదయం కలుగుతుంది ఆలూరుపాడు ప్రజలు అదేవిధంగా ఆ బాటను నడిచే ప్రతి ఒక్కరు కోరుతున్నారు
.
