
పయనించే సూర్యుడు న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు నానమ్మ మరణించిన విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో చేగుంట ఒకటో వార్డు సభ్యుడు మంచికట్ల వంశీ పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది స