మార్ల వాయి – జీ. పి, మరియు గ్రామాల్లో “పర్యావరణాన్ని కాపాడుకుందాం” – సర్పంచ్ కనక ప్రతిభ పిలుపు.

జనం న్యూస్ 7 జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మార్ల వాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. ఆమె మాట్లాడుతూ – ప్రస్తుతం మానవ అవసరాల కోసం తయారవుతున్న అనేక వస్తువులు పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని, దీనివల్ల వర్షపాతం లో మార్పులు, ఎండల తీవ్రత పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఓజోన్ పొరల నాశనం, వాతావరణ మార్పులు భవిష్యత్తులో మానవజాతికి పెద్ద ముప్పుగా మారనున్నాయని హెచ్చరించారు. త్యేకంగా ప్లాస్టిక్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, ప్రకృతి అనుకూల వస్తువులను ఉపయోగించాలి, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి అని పిలుపునిచ్చారు. గ్రామసభ అనంతరం గ్రామస్తులకు ప్లాస్టిక్ రహిత బట్ట సంచులను పంపిణీ చేశారు. కూరగాయల కొనుగోలుకు ఈ సంచులను ఉపయోగించాలని సూచిస్తూ, పర్యావరణ రక్షణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్, వార్డు సభ్యులు కనక భరత్, కొడప పుల్ల బాయి,గేడం ,జూగ్నక దర్యావంతి గోవింద్,తుంరం సీత లింబరావ్,అంగన్వాడీ టీచర్ కొడప నేతూ బాయి, గ్రామ పిసా మొబిలైజర్ కనక యాదోవ్,గ్రామస్తులు గేడం దేవ్ నందు,జంగు, జూగాది రావ్, తరుణ్,రాంషా,దత్తు,విషం రావ్, శ్రీను, రాహుల్ శంకర్,తదితరులు యూత్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.