మా నాన్నకు ఆర్థికంగా సాయం అందించి ప్రాణాలు కాపాడండి.రోడ్డు ప్రమాదంలో గాయపడిన తండ్రికి తనయుడు వేడుకోలు.

పయనించే సూర్యుడు న్యూస్ :జూలై 7,తల్లాడ రిపోర్టర్ బాబురావు మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన షేక్ అల్లి బాబు రోడ్ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనము ను టూ వీలర్ ని ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అల్లిబాబు తలకి బలమైన గాయాలు కావడం కారణంగా ఖమ్మం ఇండస్ హాస్పిటల్ లో బ్రెయిన్ సర్జరీ చేశారు. దీనికి ఖర్చు అక్షరాల 6 లక్షలు రూపాయలు అవుతుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. మెడిసిన్ కి ఖర్చు ఎక్కువగా అవుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని మా కుటుంబానికి దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించారని ఆయన కుటుంబ సభ్యులు విన్నవిస్తున్నారు. మా నాన్న ప్రాణాలు కాపాడుకోవడానికి తమ వంతు సహాయం ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయాలనుకునే వారు 9704405388 ఫోన్ పే చేయాలని ఆయన కుమారుడు షేక్ నాగుల్ మీరా కోరారు.