మా నాయకుడు మాటిచ్చాడు అంటే చేస్తాడు… అంతే.

★ అచ్చన్న... మజాకా.

జనం న్యూస్ జూన్ 7 కోటబొమ్మాళి మండలం :మా నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు మాటిచ్చాడు అంటే చేస్తాడు… అంతే… అని మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల సింహాచలం అన్నారు. కొండపేట ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ కోసం 3.77 కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చే ఘనత అచ్చం నాయుడుకే దక్కిందన్నారు. పథకం పడకేసి ఏళ్లు గడుస్తున్న నాటి పాలకులలో చలనం లేకపోయిందని, టి.డి.పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఉన్నా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొండ పేట ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ కోసం నిధులు తేగలిగారన్నారు. ఐదేళ్లు ఆ ప్రాంత ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ అప్పటి అధికారి పార్టీ గాని, వామపక్షాలు గాని నోరు మెదపలేదని, టిడిపి అధికారం చేపట్టిన తర్వాత ఎర్రజెండాలతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, టెక్కలి నియోజకవర్గం అనునిత్యం సస్యశ్యామలంగా ఉంటుందంటే అది కేవలం అచ్చం నాయుడు చలవేనని సింహాచలం స్పష్టం చేశారు. ఎంతమంది ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడిన, రెచ్చగొట్టిన విజ్ఞులైన ప్రజలు అచ్చం నాయుడు పై నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయలేదని, ఎప్పటికైనా ప్రతిపక్షాలు, వాము పక్షాలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలి తప్ప ప్రజలను తప్పుతో పట్టించొద్దని ఆయన హితో పలికారు.