మిడ్జిల్ మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ కృతజ్ఞత సభ

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 05 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ ఉమ్మడి మండలం ఊరుకొండ మండల కేంద్రాలలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల క్రితం మిడ్జిల్ ఉమ్మడి మండల కేంద్రంలో జెడ్పిటిసి గా పోటీ చేసి జూలై 4వ తేదీన గెలిచి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా హోదాలో మిడ్జిల్ ఉమ్మడి మండల ప్రజలకు కృతజ్ఞతా భావంతో వారి రుణం తీర్చుకునే వారి రుణం తీర్చుకునే సంకల్పంతో, మరియు జడ్చర్ల శాసనసభ్యులు జనం పల్లి అనిరుద్ రెడ్డి ప్రోత్బలంతో ఊరుకొండ మండల అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు భూమి పూజ నిర్వహించారు. తిరిగి మిడ్జిల్ మండల కేంద్రంలో కృతజ్ఞత సభ లో పాల్గొన్నారు. ఉమ్మడి మండల ప్రతి గ్రామపంచాయతీకి 50 లక్షల రూపాయలు అభివృద్ధి దృశ్య ఇచ్చుటకు ప్రకటించారు. ఈ సభలో గతంలో జరిగిన జెడ్పిటిసి ఎన్నికలలో గెలిచిన విధానం ఓడిపోయిన అభ్యర్థి అయిన రబ్బాని అన్న గారి గురించి ప్రత్యేకంగా వివరిస్తూ 35 సంవత్సరాల ప్రజా క్షేత్రంలో ప్రజలకు సేవలు అందించిన రబ్బానికి ప్రభుత్వంలో మంచి హోదా కల్పించాలని ఉపముఖ్యమంత్రి సహకారం కోరుతూ అతనికి హోదా కల్పించాలని తెలియజేశారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఎస్సీ వర్గీకరణ చాలాకాలంగా పెండింగ్లో ఉండి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే తీర్మానం చేసి ఏబిసిడి వర్గీకరణ అయ్యేలా సహకరించి అమలు చేశామని తెలియపరిచారు. ఇంకా ఈ పాలమూరు జిల్లాకు వలసల జిల్లా మరియు ఉమ్మడి పాలమూరు జిల్లా గట్టు మండలం మిడ్జిల్ మండలం డార్క్ ఏరియాగా గత ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇక్కడ మిడ్జిల్ మండలం నుంచి జెడ్పిటిసిగా గెలిచిన మీరు నాటిన మొక్కే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ప్రజా పాలన ప్రజలకు అందిస్తున్నాను. ఈ మిడ్జిల్ ఉమ్మడి మండలానికి నేను ఏమిచ్చినా చివరికి నా ప్రాణం ఇచ్చిన తక్కువే ఈ మిడ్జిల్ మండలానికి రుణపడి ఉన్నాను. మిడ్జిల్ ఉమ్మడి మండలాన్ని అభివృద్ధి పరుస్తాను. దొరల పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించి ఈ ప్రజా పాలనను ప్రజలు 2034 వరకు ఈ ప్రజా పాలన ప్రభుత్వాన్ని కి వెంట నడుస్తారని కోరుతూ, ఈ పాలమూరు ముద్దుబిడ్డగా నన్ను రెండవ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా మంత్రివర్యులు వాకిటి శ్రీహరి సహచార మంత్రులు జూపల్లి కృష్ణారావు ఈ నియోజకవర్గ జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి వివిధ పదవులలో ఉన్న చైర్మన్లు శాసనసభ్యులు సమాచార మంత్రులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వివిధ పదవుల్లో ఉన్నవారు ఉమ్మడి మిడ్జిల్ మండల నాయకులు కార్యకర్తలు ఉమ్మడి మండల ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా దిగ్విజయం చేశారు.