మియాపూర్ మంగళవారంసంతకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచిఅధికారికంగి అనుమతి.

పయనించే సూర్యుడు, జూలై 07 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ మియాపూర్ ప్రాంత ప్రజలకు,వ్యాపా రులకు శుభవార్త. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసి) నుండి మియాపూర్ మంగళవారం సంత నిర్వహణకు అధికారిక అనుమతి పత్రం ఈరోజు అందడం జరిగింది.మార్కె ట్ కమిటీ ప్రతినిధులు ఈ అనుమతి పత్రాన్ని అధికారికంగా స్వీకరించారు. గత నాలుగు వారాలుగా మార్కెట్ వ్యాపారుల జీవనోపాధిని కాపాడాలనే లక్ష్యంతో చేపట్టిన నిరంతర పోరాటానికి ఇది విజయవంతమైన ఫలితం.ఇకపై రేపటి నుంచి ప్రతి మంగళవారం మియాపూర్ మంగళవారం సంత ఎటువంటి ఆటంకాలు లేకుండా,అధి కారిక అనుమతులతో నిర్వహించబడు తుంది.ఈ సందర్భంగా ఈ అనుమతి లభించేందుకు సహకరించిన పెద్దలు, గౌరవనీయులు, ప్రజాప్రతినిధులు,అధి కారుల కు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వ క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.ప్రత్యేకంగా: గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి,కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర నాయకులు శ్రీ రవికు మార్ యాదవ్ కి,సీఎంసీ కమిషనర్ మేడంకి,సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు,ఈ ఉద్య మానికి అండగా నిలిచిన మిత్రులకు, మార్కెట్ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమం లో బోయిని మహేష్ యాదవ్,అడ్వ కేట్ కిషోర్ యాదవ్,లక్ష్మణ్,రాధాకృష్ణ యాదవ్,గణేష్ ,దేవేందర్,బాబూగౌడ్ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కాజా పాషా సభ్యులు, వ్యాపారులు,ఇతర ప్రము ఖులు పాల్గొన్నారు.మియాపూర్ మంగళవారం సంతను విజయవం తంగా నిర్వహిస్తూ,వ్యాపారుల జీవ నోపాధిని పరిరక్షించేందుకు మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియ జేస్తున్నాము. మార్కెట్ కమిటీకి అసోసియేషన్ నిరంతరం పనిచేస్తుందని తెలియ జేశారు.