ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & మహేష్ కుమార్ గౌడ్ ల చిత్రపటానికి పాలాభిషేకం

పయనించే సూర్యుడు ,జూలై 09 , బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ పంట పెట్టుబడి సహాయం కొరకు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో సకాలంలో వేసినందుకు బుధవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి బూర్గంపహాడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పూలపెళ్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం గతంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తుందని రైతును రాజు చేయడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వారు ధన్యవాదములు తెలియజేశారు.