ముగిసిన వేసవి శిక్షణ శిబిరం.

పయనించే సూర్యుడు న్యూస్ మే 26 సాలూర : సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 15 రోజుల నుంచి నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది.విద్యార్థినీ విద్యార్థులకు యోగ మరియు డ్రాయింగ్,డాన్స్ లు నేర్పించారు.గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజూష ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు పర్టీసీపేషెంట్ సర్టిఫికెట్స్ లను అందజేశారు.విద్యార్థినీ విద్యార్థులు యోగ మరియు డ్రాయింగ్,డాన్సులు ప్రదర్శించి తమ తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు,వేసవి శిక్షణ శిబిర వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.