మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

చైర్ పర్సన్ మైలారపు లింబాద్రి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 26 మెట్ పల్లి పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన సోమవారం రోజునా కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో (29) అంశాలను పొందుపరచగా అట్టి అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపినారు. అనంతరం గౌరవ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ అన్ని వార్డులలో అవసరం ఉన్న చోట సి.సి. రోడ్లను వెంటనే నిర్మించాలని కోరినారు. అందుకు గౌరవ చైర్ పర్సన్ మాట్లాడుతూ దశలవారీగా సి.సి రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపినారు ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మైలారపు లింబాద్రి , మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ , మున్సిపల్ కమిషనర్ డి. శ్రీనివాస్ గౌడ్ , డి. ఇ.ఇ నాగేశ్వరరావు , మేనేజర్ వెంకటలక్ష్మి , టి.పి.ఓ రాజేంద్రప్రసాద్ , ఆర్.ఓ. మిర్జా అజ్మతుల్లా బేగ్ , జె.ఎ.ఓ రమేష్ I/c శానిటరీ ఇన్స్పెక్టర్ సి హెచ్ . రాజ్ కుమార్ , గౌరవ కౌన్సిలర్స్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గోన్నారు.