మురళీధర్ దేశ్ పాండే గారికి నివాళులు అర్పించిన కళాకారులు

పయనించే సూర్యుడు జూన్ 16 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జానపద సకల కళల పరిరక్షణ పరిరక్షణ సమితి అధ్యక్షులు మురళి దేశ్ పాండే గారికి వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం నందు పాండే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించనైనది ఈ కార్యక్రమంలో కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి సీనియర్ పాత్రికేయులు తీగల మల్లికార్జున్ జిల్లా కళాకారుల విభాగంప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లు బొప్ప దేవయ్య, కళాకారులు గొర్రె శంకర్ , మామిండ్ల సత్తయ్య, తదితరులు కళాకారులు పాల్గొన్నారు.